ఎమ్మెల్యే అభ్యర్థనతో గిరిజనేతరులకు గృహలక్ష్మి మంజూరు
టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రగతి భవన్ లో ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గంలోని అభివృద్ధి కోసం కొన్ని నిధులు కేటాయించాలని అభ్యర్థునులతో పాటు నియోజకవర్గంలో గిరిజనేతరులు ఎంతోమంది పేదలు ఉన్నారని, కనీస ఇంటి సౌకర్యం కూడా లేకుండా కూలి పనులతో జీవనం సాగిస్తున్న వారు ఉన్నారని, అలాంటి వారి కోసం గృహలక్ష్మి పథకం కింద ఇల్లులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. 2 వేలు మందికి గృహలక్ష్మి పథకం మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి ఎమ్మెల్యే హరిప్రియ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్యే తో పాటు మహబూబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలత కవిత ఉన్నారు