కాంగ్రెస్ పార్టీ బీసీలకు 60 ఎమ్మెల్యే టికెట్లివ్వాలి.

వికారాబాద్ జిల్లాలో బీసీలకు కనీసం రెండు టికెట్లు కేటాయించాలి.
ముఖ్యంగా తాండూర్ నియోజకవర్గం టికెట్ బీసీలకు ఇవ్వాల్సిందే.
బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్.
తాండూరు సెప్టెంబర్ 15(జనంసాక్షి)రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం కల్పించి 60 ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్
పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో కనీసం రెండు స్థానాలు బీసీల కేటాయించాలని అత్యధిక శాతం బీసీలు ఉన్న తాండూర్ నియోజకవర్గ టికెట్ బీసీలకు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మానిక్ రావు ఠాక్రే ని హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి బీసీలు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మొన్న బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రకటించినటువంటి జాబితాలో బీసీలకు మొండి చేయి చూపడం జరిగిందని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లాలో సెట్టింగ్ల పేరుపైన ఒక్కరంటే ఒక్కరికి కూడా బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అవమానించారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓట్లు వేసే యంత్రాలుగా జెండా మోసే కార్యకర్తలుగా మాత్రమే చూస్తున్నారని బిఆర్ఎస్ పార్టీని సాకుగా చూపించి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ అధిక శాతం బీసీలకు టిక్కెట్లు ఇచ్చి బీసీల పార్టీ అని నిరూపించుకోవాలని కోరారు.బీసీల సమస్యలు అన్ని విని సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులో న్యాయం చేస్తానని మానిక్ రావు ఠాక్రే హామీ ఇచ్చారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

తాజావార్తలు