సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలకు మహర్దశ-ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్
-పోతిరెడ్డిపల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 15 : సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామాలు ఎంతో మహర్దశగా మారనున్నాయని చేర్యాల ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్ అన్నారు. శుక్రవారం చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ కత్తుల కృష్ణవేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిసి రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. గ్రామానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సహకారంతో ఎన్ఆర్ జీఎస్ నిధుల కింద 10 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో పల్లెలు పట్టణాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వారన్నారు. సిసి రోడ్ల నిర్మాణంతో గ్రామాలు మహర్దశగా మారుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడూరు బాలరాజ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గర్నపల్లి చంద్రం, బీఆర్ఎస్వీ చేర్యాల మండల అధ్యక్షులు పెంబర్ల రాజశేఖర్, వార్డు సభ్యులు మెడబోయిన కుమార్, కొక్కొండ కిష్టయ్య, ముద్దుల కవిత, గ్రామపంచాయతీ కార్యదర్శి పల్లె రజిత, ఎంపీటీసీలు శివశంకర్, శ్రీనివాస్ రెడ్డి, చుక్కారెడ్డి, సీఏలు రమ గ్రామస్తులు పాల్గొన్నారు.