గీత కార్మిక సంఘం యువజన అధ్యక్షుడిగా గట్టు అనిల్ కుమార్

జనంసాక్షి, మంథని : సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యువజన విభాగం అధ్యక్షుడిగా మంథని మండలం అడవి సోమున్ పల్లి గ్రామానికి చెందిన గట్టు అనిల్ శుక్రవారం కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమాజిగూడ లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సంఘం జాతీయ అధ్యక్షులు జైహింద్ గౌడ్, వ్యవస్థాపక అధ్యక్షులు పెంటయ్య గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. సంఘాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో యువకుడైన అనిల్ గౌడ్ ను మించినట్లు చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఇచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని అని అనిల్ గౌడ్ అన్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ సంఘ బలోపేతానికి జిల్లా మండల గ్రామీణ స్థాయి వరకు కమిటీలు వేస్తామని చెప్పారు. అనిల్ గౌడ్ నియామకం పట్ల పలువురు గౌడ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

తాజావార్తలు