వనపర్తి అసెంబ్లీలో బీజేపీని గెలిపించడమే నా లక్ష్యం

బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్15 (జనం సాక్షి)

వనపర్తి అసెంబ్లీలో బీజేపీని గెలిపించడమే నా లక్ష్యం అని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్ అన్నారు.
బిజెపి సీనియర్ నాయకులు బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మున్నూరు రవీందర్ ని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమించిన సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డా.ఏ.రాజా వర్ధన్ రెడ్డి అధ్యక్షతన వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కృష్ణ గార్డెన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్ మాట్లాడుతూ చిన్నతనం నుండి రాష్ట్రీయ స్వయసేవక్ సంఘ్ సభ్యులుగా పనిచేసి భారతీయ జనసంఘ రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత వనపర్తి పట్టణ అధ్యక్షునిగా రెండు పర్యాయాలు పనిచేయడం జరిగిందని వనపర్తి కమ్యూనిస్టులకు అడ్డగా ఉన్న సందర్భంలో బిజెపి పట్టణ అధ్యక్షునిగా పార్టీ విస్తరణకై అవిశ్రాంత కృషి చేయడం జరిగిందని నాటి ప్రధాని రాజీవ్ గాంధీ మరణాంతరం కాంగ్రెస్ పార్టీ మూకలు నా ఇల్లు మరియు వ్యాపార సముదాయాలపై దాడి చేసి తీవ్రంగా ఆస్తి నష్టం కలిగించిన కాషా జండాను విడిచిపెట్టలేదని 1994 శాసనసభ ఎన్నికల్లో వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 7845 ఓట్లు సాధించడం జరిగిందని తెలియజేశారు.ప్రముఖ న్యాయవాదిగా బార్ కౌన్సిల్ చైర్మన్గా న్యాయవాద వృత్తిలో వనపర్తి జిల్లా ముఖ్యంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా సేవలు అందించడం జరిగిందని పార్టీకి సేవ చేసిన సేవలకు గమనించిన రాష్ట్ర పార్టీ ఓబీసీ ముర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమించడం నా బాధ్యతను మరింత పెంచిందని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాజీ అధ్యక్షులు బండి సంజయ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ జిల్లా అధ్యక్షులు రాజ వర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం గడ్డమీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడమే నా ఏకైక లక్ష్యం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బిజెపిని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు బిజెపి పార్టీపై బురదజల్లే ప్రయత్నంలో బాగానే భాగంగానే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు దించిన తర్వాత గ్రాఫు పడిపోయిందని కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అసత్య ప్రచారంతో బిజెపిని దెబ్బతీసే ప్రచారం చేస్తున్నారని కానీ రెండు సీట్ల నుండి 303 సీట్ల వరకు వచ్చిన ఘనత బిజెపి పార్టీ కుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛమైన నీతివంతమైన పాలనతో దేశంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.
పాత్రికేయ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి శ్రీశైలం జిల్లా ప్రధాన కార్యదర్శిలు డి నారాయణ ఏ రామన్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ జిల్లా అధికార ప్రతినిధి బాబురావు పట్టణ అధ్యక్షులు బచ్చు రాము మండల అధ్యక్షులు సర్పంచ్ ఎద్దుల దేవేందర్ యు మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కదిరే మధు మండల వెంకటేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు