అవార్డు విచారణ చేపట్టిన మంథని ఆర్డిఓ

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని గ్రామ శివారులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణములో భాగమైన అన్నారం బ్యారేజ్ వాటర్ లెవల్ +119.00 నందు ముంపునకు గురియగు 33.35 గుం.ల భూమికి సంబందించి మంథని ఆర్డీవో హనుమానాయక్ శుక్రవారం మంథని ఆర్డిఓ కార్యాలయము ఆవరణలో అవార్డు విచారణ నిర్వహించినారు. ఇట్టి విచారణలో రైతులకు/భూ నిర్వాసితులకు భూసేకరణలో పోవు భూమి కి సంబంధించిన వివరములు తెలిపారు. రైతుల సందేహములను నివృతి చేశారు. ఈ కార్యక్రమములో మంథని, తహసీల్దార్ రాజయ్య, ఇరిగేషన్ ఏఈ, రైతులు పాల్గొన్నారు.

తాజావార్తలు