దోపిడీకి వ్యతిరేకంగా పేద ప్రజలందరూ ఏకం కావాలి. కోడేరు మండల ప్రజలకు సిపిఎం పిలుపు.
కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 15
ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమై, రాబోయే ఎన్నికల్లో ప్రజలను మళ్లీ మోసం చేయడానికి అనేక రకాల వాగ్దానాలతో ముందుకు వస్తున్నాయి. వారి మోసపూరిత వాగ్దానాలకు మోసపోవద్దని తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని తీసుకొని ప్రజలు అప్రమత్తంగా పాలకవర్గాలకు వ్యతిరేకంగా నిలబడాలని సిపిఎం కోడేరు మండల కార్యదర్శి పి నరసింహ పిలుపునిచ్చారు.
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా కోడేరు మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీకి , రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటమే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని అన్నారు.
రాజులు, ముస్లిం. జమీందారులు, హిందువులు.రజాకర్లు ముస్లింలు. వారి అడ్డాలు భూస్వాముల గడీలు.ఈ పోరాటంలో మతభావాలకు ఎలాంటి తావులేదు.
దోపిడీ చేసేటోళ్లు ఒక వర్గం దోపిడీకి గురైనోళ్ళు ఒక వర్గం.
దోపిడీకి గురయ్యే వారి పక్షాన నిలబడింది ఎర్రజెండా. కమ్యూనిస్టులు అని గుర్తు చేశారు.
శ్రమ దోపిడి మీద, దౌర్జన్యాల మీద, సాగిన తిరుగుబాటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని ఆయన అన్నారు.కేవలం తెలంగాణ ప్రజల మధ్య మతపరమైన విభజనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి మతం రంగు పులుమడానికి నేటి పాలకులు చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.అందుకే తెలంగాణ ప్రజలు చైతన్యo ప్రదర్శించి శ్రామికులంతా ఐక్యంగా నిలబడి బిజెపి ఆర్ఎస్ఎస్ను ఓడించాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మతసామరస్యాన్ని కాపాడాలని కోరుతున్నాము.సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.
అనంతరం జరిగిన ఈ బైకు ర్యాలీ మండలంలోని నాగులపల్లి ,ముత్తిరెడ్డిపల్లి,, తుర్కదిన్నె, రాజాపురం, సింగయపల్లి, మాచుపల్లి ,మైలారం ఎత్తం, నర్సాయిపల్లి,కొండ్రావు పల్లి, కోడేరు తదితర గ్రామాల్లో జరిగింది.*
ఈ బైకు ర్యాలీ కార్యక్రమంలో సిపిఎం కోడేరు మండల కమిటీ సభ్యులు ఎండి మాలిక్, సిపిఎం నాయకులు రాజాపూర్ బిచ్చన్న ,రాజు, కురుమయ్య, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు రవి, కోడేరు గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు మరాఠీ వెంకటయ్య ,సి పర్వతాలు, సి .కృష్ణ, డి వంశీ, వి.రాజేష్,ఆది మిద్దె కార్తీక్, ప్రజా సంఘాల నాయకులు ఆది భాస్కర్, బద్దుల రాము, లాలు వడ్డే సురేష్, బి శ్రీకాంత్, రాజాపూర్ బాలస్వామి ,సింగాయిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.