టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి

జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ,సెప్టెంబర్ 15 (జనం సాక్షి);

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శుక్రవారం టెట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
గద్వాల పట్టణంలోని కృష్ణవేణి కళాశాల, ఎస్వీఎం కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాలను ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత మంది అభ్యర్థులు హాజరయ్యారు, ఎంత మంది అబ్సేంట్ అయ్యారు, చీఫ్ సూపరిండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్ష నిర్వహణ , బందోబస్తు తదితర వాటిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 34 సెంటర్లలో జిల్లా నుండి 13,255 అభ్యర్థులకు గాను ఉదయం పేపర్ అభ్యర్థులు 8052 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7030 మంది హాజరయ్యారని, 1022 మంది అభ్యర్థులు అబ్సేంట్ అయ్యారని , మద్యాహ్నం పేపర్ కు 5203 అబ్యార్థులు పరీక్ష రాయల్సి ఉండగా 4825 మంది హాజరైయ్యారని , 378 మంది అబ్సేంట్ అయ్యారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుంగా పరీక్షలు సజవుగ జరిగాయని తెలిపారు. కలెక్టర్ తో పాటు ఎం ఇ ఓ రాజు, చీఫ్ సూపర్ ఇండెంట్ హనుమంతు రెడ్డి, నాగేశ్వర్ రావు , తహసిల్దారు కె. టి దొడ్డి సరిత రాణి తదితరులు ఉన్నారు.

తాజావార్తలు