రెండవ రోజు కొనసాగిన రిలే దీక్ష
జహీరాబాద్ సెప్టెంబర్ 15( జనం సాక్షి) ఉల్లాస్ మాదిగ ఆద్వర్యంలో రెండవ రోజు జహీరాబాద్ ఎమ్మార్పో కార్యాలయం ముందు రిలే దీక్ష. కు మద్దతుగా రాయికొటి నర్సింములు మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఉపాధ్యక్షులు ప్రారంభించి మాట్లాడుతూ. జనాభా దామాషా ప్రకారం ఎవరికి దక్కాల్సిన వాటా వారికి న్యాయబద్ధంగా దాక్కాల్సిందే అని పెర్కొన్నారు..
ఉల్లాస్ మాదిగ ఎమ్మార్పియస్ నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతూ..ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును ఈ నెల 18 నుండి 22 వరకు జరిగే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో నే ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.. కార్యక్రమంలో..మహాజన సోషలిస్ట్ పార్టీ జహీరాబాద్ కన్వీనర్ జైరాజ్,నాయకులు..పద్మారావు,సిమోన్,దయానంద్,మాణిక్ లు పాల్గొన్నారు