నేడు పుల్కల్ మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటన
జోగిపేట, సెప్టెంబర్ 15, జనంసాక్షి: నేడు పుల్కల్ మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటించానున్నారు. సింగూర్ ప్రాజెక్ట్ లో చేప పిల్లలను వదిలి, బస్వాపూర్ కెనాల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తరువాత ఏఎస్ గార్డెన్ లో వికలాంగులకు రూ. 4000 లకు పెంచిన పెన్షన్ పత్రాలను అందించానున్నారని పుల్కల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ అన్నారు. వీటితో పాటు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు, మైనార్టీ బంధు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జడ్పీ చైర్మన్ మంజూశ్రీ జైపాల్ రెడ్డి, టిఎస్టీపీసీ చైర్మన్ మఠం బిక్షపతి తదితరులు పాల్గొననున్నట్లు చెప్పారు.