టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత ఎల్లే రామ్మూర్తి
జనంసాక్షి, రామగిరి : ఉమ్మడి కరీంనగర్ డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్, ఉమ్మడి కమాన్ పూర్ మాజీ జడ్పీటీసి భర్త ఎల్లె రామ్మూర్తి శుక్రవారం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పుట్ట మధు గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శంకేష్ రవీందర్, పూదరి సత్యనారాయణ గౌడ్, మేదరవేన కుమార్, ఇనుగంటి రామారావు, కొలిపాక సత్తయ్య, కాపరవీణ భాస్కర్, దామెర శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.