ఛత్రపతి శివాజీ యువసేన ఉపాధ్యక్షుడి రక్త దానం
జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన బత్తుల సాయిరుతిక్ అనారోగ్యం తో కరీంనగర్ లోని అపోలో రిచ్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నాడు. అతనికి రక్తకాణాలు 20వేలకు పడిపోగా, రక్తం ప్లేట్ లెట్స్ అవసరం, ఉంటుందని డాక్టర్లు తెలుపగా, వారి కుటుంబ సభ్యులు రక్తంగ్రూప్ ఏ పాజిటివ్ రక్తం కోసం ఛత్రపతి శివాజీ యువసేన వారిని సంప్రదించగా, ఛత్రపతి శివాజీ యువసేన ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ వెళ్లి రక్త కణాలు ప్లేట్ లెట్స్ దానం చేశారు. రక్త దానం చేసిన శ్రీనివాస్ కు వారి కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్బంగా ఛత్రపతి కొమ్ము శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ వర్షాకాలం వ్యాధుల సీజన్ లో ప్రజలు జాగ్రత్త గా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకువాలని ఆరోగ్యావంతమైన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు.