విద్యతోనే కుటుంబం, సమాజం దేశం అభివృద్ధి చెందుతుంది.

ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి.
విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలి.
హాస్టల్ వార్డెన్ స్వప్న సేవలు బేస్.
జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్.
తాండూరు సెప్టెంబర్ 15(జనంసాక్షి) విద్యావంతులైన స్త్రీలు జీవితంలో చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబం సమాజం మరియు దేశం అభివృద్ధి చెందడానికి విద్య చాలా ముఖ్యమైందని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ బిసి కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు.శుక్రవారం తాండూరు పట్టణంలో బిసి బాలికల కళాశాల వసతి గృహం హాస్టల్ వార్డెన్ స్వప్న ఆహ్వానం మేరకు ప్రభుత్వం అందిస్తున్న ప్లేట్స్ గ్లాసులు రాజ్ కుమార్ విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాలు పేద విద్యార్థుల చదువుకొరకై వేలాది రూపాయలు వేచిస్తుందని అందుకు అనుగుణంగా ప్రతి విద్యార్థి చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడాలని విద్యార్థులను సూచించారు. గత 13 సంవత్సరాల నుండి హాస్టల్ వార్డెన్ గా సేవలందిస్తున్న స్వప్న ప్రతినిత్యం విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్న స్వప్న కు ధన్యవాదాలు తెలియజేశారు.తాండూర్ ప్రాంతంలో సొంత హాస్టల్ భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సొంత భవనాలు నిర్మించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు నేటి టెక్నాలజీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఆధునికమైన వసతులు సమకూర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ స్వప్న బిసి మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, ప్రధాన కార్యదర్శి అనిత, ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్యదర్శి నరసమ్మ, షైన్ బేగం, బీసీ యువజన కార్యదర్శి బోయ రాధాకృష్ణ ,బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్ ,సాయి భాస్కర్, మతిన్, శ్రీనివాస్ ,సురేందర్ ,నగేష్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు