పోషణ మాసం వారోత్సవాలు
మోత్కూరు సెప్టెంబర్ 15 జనంసాక్షి :
మోత్కూరు మండలం కొండగడప,పనక బండ, పాలడుగు గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రంలలో శుక్రవారం పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేశారు. ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ మంగమ్మ మాట్లాడుతూ 1000 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించారు. కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు తోడ్పాటుగా గర్భిణీ స్త్రీల సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పాలు, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లమ్మ, హెల్త్ స్టాఫ్ వెంకన్న, కే.అలివేలుమంగ, ఎ.రేణుక,టీచర్ లు కొంపల్లి లలిత, పి. రేణుక , ఆయా లలిత, గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు పాల్గొన్నారు.