మోత్కూరు మున్సిపాలిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గా అన్నెపు పద్మ
మోత్కూరు సెప్టెంబర్ 15 జనం సాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అన్నెపు పద్మని నియమించి, నియామక పత్రాన్ని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు అన్నెపు పద్మ మాట్లాడుతూ నా నియమనికి సహకరించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు,జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ,మోత్కూర్ మండల అధ్యక్షురాలు ముద్దం జయశ్రీ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అన్నెపు ఎల్లమ్మ,ఎలాకాని సైదమ్మ తదితరులు ఉన్నారు.