విజయ భేరి సభ ను విజయ వంతం చేయండి
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు హరి ప్రసాద్..
భువగిరి టౌన్ (జనం సాక్షి):–
ఈ నెల 17 వ తేదీ న హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పది లక్షల మందితో నిర్వహిస్తున్న విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్ ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. భువనగిరి పట్టణంలోని భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ కార్యాలయం ఇందిరా భవన్ లో జరిగిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం మరియు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణయాక మండలి సి డబ్ల్యు సి సమావేశాల సందర్భంగా 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించబోతున్న విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించినందున ఈ బహిరంగ సభకు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారు బావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు దేశంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిలు ప్రతిపక్ష నాయకులు సి డబ్ల్యూ సి, ఏ ఐ సి సి నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నందున ప్రతి కార్యకర్త సభ విజయవంతం కోసం వారి వంతుగా పనిచేసే భువనగిరి నియోజకవర్గం నుండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంజాల రామాంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ సమన్వయంతో 500 వాహనాలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ప్రజలను తరలిస్తున్నామని కావున ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కొండాపురం గణేష్ ,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సిరికొండ శివకుమార్, ఉడుత కార్తీక్, బబ్బూరి నరసింహ, సురుగు చంద్రయ్య గౌడ్, కమ్మగాని అంజయ్య, మాటూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు.