మంత్రి కొప్పులకే మా ఓటు: అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్

ధర్మపురి ( జనం సాక్షి)అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలుపు కొరకు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మాలలా ఐక్యవేదిక ధర్మపురి మండలాధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ అన్నారు. ఐక్యవేదిక వార్షికోత్సవ సందర్భంగా పట్టణంలోని ఎస్ హెచ్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. డా .బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమానులు వేసి నివాళులర్పించారు తదనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలోని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివృద్ధి చేశారని అభివృద్ధి పనులు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయన్నారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎల్ ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ స్నేహలత మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, రాష్ట్ర సలహాదారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు