ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

-రాయపోల్..ఖానాపూర్ గ్రామాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నాయకులు..పార్టీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించిన టిపిసిసి ఉపాధ్యక్షుడు మల్ రెడ్డి రంగారెడ్డిసెప్టెంబర్ 17 నిర్వహించే విజయభేరి బహిరంగ సభకు పట్నం నియోజకవర్గం నుండి భారీగా తరలింపు ఏర్పాట్లువిజయభేరి ప్రత్యేక పోస్టర్ నీ విడుదల చేసిన మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్15(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామం..మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామం నుండి బి ఎస్పి నాయకులు మహేష్ మహారాజు తో పాటు రాయపోల్ గ్రామం నుండి వివిధ పార్టీల నాయకులు మరియు శాలివాహన సంఘం (కుమ్మర) ప్రతినిధులు శుక్రవారం టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి క్యాంపు కార్యాలయం లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు హరిజన గిరిజన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు..దేశంలో రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ పార్టీల పట్ల ప్రజల విసిగిపోయారని అవినీతి బంధుప్రీతి భూకబ్జాలకు పేపర్ లీకేజ్ లకు కేరాఫ్ గా మోడీ కేసీఆర్ లు మిగిలిపోయారని ఎద్దేవా చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కలల్ని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు సాకారం చేయబోతున్నారని అన్నారు.
సెప్టెంబర్ 17న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ విజయబేరి సభకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి దాదాపు 25 వేల మందిని తరలిస్తున్నట్టు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ లను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని.. రేపు సోనియా గాంధీ ఇవ్వబోయే 5 గ్యారెంటీ స్కీం లను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబెడతామని అన్నారు.నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని త్వరలో వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలియజేశారు.

తాజావార్తలు