విద్యావంతులు నిరుద్యోగులు సాధారణ కార్యకర్తలు ప్రభుత్వ విధానాలపై విసిగించండి కాంగ్రెస్ పార్టీకి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు-మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్15(జనంసాక్షి):-
విద్యావంతులు నిరుద్యోగులు సాధారణ కార్యకర్తలు ప్రభుత్వ విధానాలపై విసుగు చెంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని యాచారం మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని నంది వనపర్తి గ్రామంలో కార్యకర్తల ముఖ్య నాయకుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి హాజరయ్యారు మొదటగా పార్టీ మండల అధ్యక్షులు మస్కు నరసింహ, కిసాన్ సెల్ అధ్యక్షులు లిక్కి పాండు రంగారెడ్డి, వెంకటరెడ్డి, మొటే శ్రీశైలం ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ అని కెసిఆర్ విస్మరించడం చాలా బాధాకరమన్నారు. ధనవంత రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణను నేడు అప్పలపాలు చేసి దేశంలోనే అత్యంత దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రాన్ని తెచ్చిదిదిద్దుతున్నాడు కేసీఆర్ కే దక్కుతుంది చరిత్ర దుయ్యబట్టారు. ధరణి అనే ఫోటోలతో నిరుపేదల పుట్టగొట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయల ఖజానా సొమ్ము చేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో సంపన్నులకే సంక్షేమ పథకాలు అన్న తీర్ రీతిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు విద్యావంతులు విశ్లేషకులు అన్నీ గమనిస్తున్నారని చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

తాజావార్తలు