ధర్మపురిలో గడప గడపకు కాంగ్రెస్

-కాంగ్రెస్ తోనే అన్నివర్గాలకు న్యాయం

-ధర్మపురి కాంగ్రెస్ నాయకులు గజ్జెల స్వామి

జగిత్యాల ,సెప్టెంబర్ 15కాంగ్రెస్ హయాంలోనే అన్నివర్గాలకు న్యాయం జరిగిందని,రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధర్మపురి నియోజకవర్గo కాంగ్రెస్ నాయకులు గజ్జెల స్వామి అన్నారు.ధర్మపురి మండలం దొంతపూర్, జైనా, మగ్గిడి, రాజారాం ,ధమ్మన్నపేట గ్రామాల్లో శుక్రవారం గజ్జెల స్వామి ఆధ్వర్యంలో కార్యకర్తలు గడప,గడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా అధిష్టానం మేనిఫెస్టో రూపొందించిందని స్వామి అన్నారు.ఇల్లిల్లు తిరుగుతూ కాంగ్రెస్ కు మద్దతు తెలపాలని కోరుతున్నారు.
గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆధరిస్తారన్న నమ్మకముందన్నారు

తాజావార్తలు