తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక వార్షికోత్సవ సెలబ్రేషన్

ధర్మపురి (జనం సాక్షి )ధర్మపురి మండలంలోని శుక్రవారం ఉదయం S H ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర మాల ఐక్యవేదిక అధ్యక్షుడు బొల్లం మల్లేశం గత సంవత్సరం నుండి మాలల ఐక్యవేదిక కమిటీలు వేస్తున్న నేటికీ ఒక సంవత్సరం పూర్తి కావడంతో ధర్మపురిలో మొదటి వర్షికోత్సవ దినోత్సవ సెలబ్రేషన్ లో మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామ కమిటీలు ఎక్కడైతే ఇంకా పూర్తి కాలేదు అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేద్దామని ఆయన అన్నారు. తదనంతరం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర మాల కులస్తులు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎలక్షన్లో నామినేషన్ వేయాలంటూ కుల సంఘాలకు ఒక స్ఫూర్తిని ఆయన సూచించారు. ఈ వేదికలో సురమల సతీష్ జగిత్యాల అధ్యక్షుడు, ఉయ్యాల శోభన్ ప్రధాన కార్యదర్శి, దేవి అంజలి మహిళ అధ్యక్షురాలు, పాక వేణుగోపాల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గుమ్మడి శ్రీనివాస్ రాష్ట్ర కోశాధికారి, వివిధ మండల అధ్యక్షులు ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, రెడ్డి మల్ల తిరుపతి, మంత్రి రమేష్, బొడ్డు రాములు, భూపెల్లి నాగేశ్వర్, డేరా అశోక్,మంగ పుత్తూరుల జమున, బండ్ల గంగాధర్, కోమటి శేఖర్, వరుణ్ భూపల్లి యేసు రత్నం ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు

 

తాజావార్తలు