కర్రొళ్ళ లో నరసయ్య పేరు పెట్టడం సముచితం-కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 16. (జనంసాక్షి). కొనారావు పెట్ మండలంలోని మల్కపేట్ బ్యాలెన్స్ రిజర్వాయర్ కు మాజీ శాసనసభ్యులు కర్రోల్ల నరసయ్య పెట్టడం సమచితమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం అఖిలపక్షం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్కాపేట్ వాస్తవ్యులు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ శాసనసభ్యులు కర్రోళ్ల నరసయ్య పేరు పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన అందించిన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని కర్తోల్ల నరసయ్య పేరు పెట్టడం సమచితమని అన్నారు. సమావేశంలో నాలుక సత్యం రాగుల రాములు ,కంసాల మల్లేశం, ఎలగందుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.