పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం ద్వారా తాండూర్ కు లబ్ది-మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉమాశంకర్ పటేల్.
తాండూరు సెప్టెంబర్ 16 (జనం సాక్షి) పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం ద్వారా తాండూర్ ప్రాంతానికి లబ్ధి చేకూతుందని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉమా కుమార్ శంకర్ పేర్కొన్నారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ప్రాజెక్ట్ ట్రాయల్ రన్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు స్వాగతం పలికేందుకు తాండూర్ నియోజకవర్గం తాండూర్ మండలం, బషీరాబాద్, యాలాల్ , పెద్దేముల్ మండలా నుండి బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు.ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పిలుపు మేరకు నగర్ కర్నూల్ కు తాండూర్ మండలం నుంచి బి.ఆర్.ఎస్ శ్రేణులు బయలుదేరారు. ఈ సందర్భంగా అయామండలాల నాయకులుజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు రావడం ద్వారా వెనుకబడిన తాండూర్ ప్రాంతానికి ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉమా శంకర్ మరియు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామలింగ రెడ్డి,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసిల పోరం అద్యక్షుడు నరేందర్ రెడ్డి (సాయి రెడ్డి),తాండూర్ సర్పంచ్ ల సంగం అధ్యక్షుడు రాములు, మాజీ ఎంపిటిసి రఘునాథ్ రెడ్డి.. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ లు , పార్టీ అనుబంధ సంఘాలు నాయకులు పాల్గొన్నారు.