అంగన్ వాడి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కారించాలి

-అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉద్యోగ బడ్జెట్లో కల్పించాలి
-బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
వికారాబాద్ రూరల్ సెప్టెంబర్ 16 జనం సాక్షి
విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న అంగన్ వాడి ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని బి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆయన సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ తో కలిసి పోరాటం చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు విరమించవద్దని ఆయన అన్నారు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం మానుకొని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని డిమాండ్ చేశారు బి ఎస్పీ పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులందరికీ రెగ్యులర రేజ్ చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గొర్ల కాడి క్రాంతి కుమార్ వికారాబాద్ ఇంచార్జ్ పెద్ది అంజయ్య తలారి రాజు అరుణ్ కుమార్ గణేష్ గుజ్జరి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు