అంగన్వాడి సిబ్బందిని రెగ్యులరైజ్ చేయకుంటే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారు-సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్ మల్లేశ్
అచ్చంపేట ఆర్సీ, 16 సెప్టెంబర్2023 , జనంసాక్షి న్యూస్ : అంగన్వాడి సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మె లో భాగంగా స్థానిక అచ్చంపేట ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో సి ఐ టు యు ఆద్వర్యంలో అచ్చంపేట ప్రాజెక్ట్, బల్మూర్ ప్రాజెక్ట్ జేఏసీ లు సంయుక్తంగా గత కొన్ని రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సి ఐ టీ యూ జిల్లా నాయకులు ఎస్ మల్లేశ్ మాట్లాడుతూ… అంగన్వాడి సిబ్బంది ఎన్నో ఏళ్ళు పేరుకుపోయిన తమ సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని నెలల క్రితమే సంబంధిత శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కలిసి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు, దీనికి స్పందించిన మంత్రి వీటిలో కొన్ని డిమాండ్లు పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారని అయిన అంగన్వాడి సిబ్బంది డిమాండ్ల కృషి లో ఎలాంటి పురోగతి లేక ప్రభుత్వం మోసం చేసిందని ధీంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె చేపట్టారని అన్నారు. ధనిక రాష్ట్రమని ఊదర గొట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడి సిబ్బంది డిమాండ్లు అయిన రెగ్యులరైజ్,ఇరవై ఆరువేయిల వేతనం,పెన్షన్, ఈఎస్ ఐ, ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ 60 సంవత్సరాలు, ప్రమాద భీమా ఐదు లక్షలు,రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ల కు పధిలక్షలు, హెల్పర్లకు ఐదు లక్షలు, ప్రమోషన్లు, అంగన్వాడి కేంద్రాలకు భవనాలు, మౌలిక సదుపాయాలు,సరిపడా బడ్జెట్ కేటాయింపు లాంటి వి అమలు చేయాలని కోరారు.కార్యక్రమంలో అంగన్వాడి జేఏసీ జిల్లా కార్యదర్శి ఎస్ పార్వతమ్మ, చంద్రకళ, భారతి, సృజన, అలివేల,సుశీల, రజిత, అరుణ, పద్మ, లీలావతి, పార్వతి, సంధ్య, హైమావతి,భుసీర తదితరులు పాల్గొన్నారు