శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

-పెద్దమడూర్ నుండి వివిధ పార్టీలకు చెందిన యువకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పార్టీలో చేరిక

-కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి

దేవరుప్పుల ,సెప్టెంబర్ 16(జనం సాక్షి): బిఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో దేవరుప్పుల మండలంలోని పెద్దమడూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల ముఖ్య నాయకులు సోషల్ మీడియా ఇన్చార్జులు పలువురు పెద్ద ఎత్తున శనివారం పర్వతగిరి లోనీ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.మంత్రి వారికి గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు.మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రతి ఒక్కరికి చేర్చేల ప్రతి కార్యకర్త కృషి చేయాలని అన్నారు.పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సుమచిత స్థానం గౌరవం ఉంటుందని అన్నారు.పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న యువ నాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేకించి అభినందించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ నుండి బోరేం నరేందర్ రెడ్డి బీజేవైఎం జనరల్ మండల కార్యదర్శి అకవరం రాజు ఓబిసి మండల అధ్యక్షులు ఒగ్గు మల్లేష్ కర్రే వీరేష్ వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షుడు కర్రే వీరేష్ గోడిషాల శివ గోకారపు బాబు నాగేల్ల సంపత్ మునిగే శోభన్ గనపాక వినోద్ కలగోని వినయ్ గనుపాక శ్రీకాంత్ పానుగంటి రమేష్ దండబోయిన ఉమేష్ కర్రే మల్లేష్ పొదల సతీష్ కర్రే వీరస్వామి రమేష్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ మండల పార్టీ ముఖ్య నాయకులు బస్వ మల్లేష్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి జిల్లా యువజన నాయకులు కోతి ప్రవీణ్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల ఉమేష్ పెద్దమడూర్ రైతు కోఆర్డినేటర్ ఆకవరం పెద్దారెడ్డి ఎంపిటిసి పానుగంటి గిరి గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి రాములు ఉపసర్పంచ్ మానుపాటి వెంకటేష్ గ్రామ ఇంచార్జ్ తీగల సత్తయ్య పార్టీ నాయకులు నారెడ్డి సంజీవరెడ్డి మండల యువజన నాయకులు చంద్రగిరి సంపత్ మానుపాటి ఉపేందర్ జోగు శ్రీశైలం పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.

తాజావార్తలు