రేపు…శ్రీ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ జయంతి
తాండూరు సెప్టెంబర్ 16 (జనం సాక్షి)
వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలం కందనెల్లి గ్రామ సమీపంలోని బ్రహ్మంగారిగుట్టలో రేపు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు శ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞ జయంతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ విరాట్ విశ్వకర్మ కమిటీ సభ్యులు శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
రాష్ట్రగనులు, భూగర్భ వనరుల శాఖామంత్రిపట్నం మహేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు హాజరవుతున్నట్లు వెల్లడించారు.అదేవిధంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు
శుభప్రద్ పటేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, హాజరవుతున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి మండల ప్రజలు ఆయా గ్రామాల ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ విరాట్ విశ్వకర్మ మహా యజ్ఞ జయంతి కార్యక్రమం విజయవంతం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు