దేవరకొండ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపిన మక్కా మస్జిద్ మరియు ఈద్గా కంప్లీట్ కమిటీ అధ్యక్షులు అజీముద్దీన్
దేవరకొండ సెప్టెంబర్ 16 జనం సాక్షి :-దేవరకొండ పట్టణంలో శుక్రవారం రోజు రాత్రి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మక్కా మస్జిద్ మరియు ఈద్గా కాంప్లెక్స్ కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మహమ్మద్ అజీముద్దీన్ 47 ఓట్ల మెజార్టీతో గెలుపొందడంతో వారు సంతోషం వ్యక్తం చేసారు.అనంతరం వారు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ఓటర్ మహాశయులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిమానులకు,హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.దేవరకొండ పట్టణంలో ఉన్న అన్ని మస్జిద్ ల అభివృద్ధి కొరకు ముస్లిం సోదరుల పెద్దలను యువకులను కలుపుకొని అందరి సహకారంతో మక్కా మసీద్ మరియు ఈద్గా కాంప్లెక్స్ కమిటీని మరింత బలోపేతం చేస్తానని అన్నారు. బేష జాలకు పోకుండా అందరినీ కలుపుకొని ముస్లిం సోదరుల సహాయ సహకారాలతో ఖబ్రస్థాన్ లను షాది ఖానాను , పేద ముస్లిం సోదరుల కుటుంబాలను, పట్టణంలో ఉన్న అన్ని మస్జిద్ ల సమస్యలను మక్క మస్జిద్ మరియు ఈద్గా కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షుడిగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.ఈ ఎన్నికలు ప్రశాంతంగా కట్టుదిట్టమైన భద్రతతో నిర్వహించిన ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ బాసిద్ మరియు మహమ్మద్ ముఫ్తి జావేద్ హుస్సేన్ ఖాస్మి, మహమ్మద్ ముఫ్తి రిజ్వాన్ మరియు ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.