ఆకస్మికంగా ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన*అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ సత్యంబాబు*
వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 16 (జనం సాక్షిశ్రీరంగాపూర్ మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంగం సొసైటీని, మరియు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసినఅసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సత్యంబాబు తనిఖీ చేయడం జరిగింది. రైతులకు కావలసిన యూరియా కావలసినంత అందుబాటులో ఉందని ఎక్కడ గాని కొరతలేదని డీలర్లు తెలిపారు. యూరియా అమ్మిన వెంటనే ఎప్పటికప్పుడు పి ఓ ఎస్ మిషన్ లో నమోదు చేయాలని డీలర్లకు అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వారితో పాటు మండల వ్యవసాయ అధికారి చంద్రమౌళి తనిఖీలో పాల్గొన్నారు.