మెగా డీఎస్సీ ని ప్రకటించాలి
* అన్ని రంగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి
* నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని యువతను మోసం చేస్తున్న ప్రభుత్వం
* పివైఎల్ డిమాండ్
టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థల్లో, కాలేజీల్లో,యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీచేయాలని మెగా డీఎస్సీని ప్రకటించాలని,ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సిని ప్రకటించాలని తూతూ మంత్రంగా నిరుద్యోగ యువతను నమ్మించే నియామకాలతో మోసం చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం మానుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) డిమాండ్ చేసింది. శనివారం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు పి వై ఎల్ ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీనీ విస్మరించిందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేస్తున్న పాలనకు వ్యతిరే కంగా తెలంగాణ యువత ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో వందల మంది తమ నిండు ప్రాణాలను బలి తీసుకుని రాష్ట్రాన్ని సాధించారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి గత పదిహేళ్లుగా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నదని, తెలంగాణ రాష్ట్రంలో లక్ష 30 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే దానిని భర్తీ చేయకుండా కాంట్రాక్టు,అవుట్సోర్సింగు తదితర పేర్లతో నడిపిస్తున్నదని విమర్శించారు.ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని,నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు రూ.3116లు నిరుద్యోగ భృతిగా చెల్లిస్తానని పేర్కొన్నప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ భ�