రేపు తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయండి.

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబిబ్ లాల.
తాండూరు సెప్టెంబర్ 16(జనంసాక్షి)రేపు తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబిబ్ లాల పేర్కొన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ ఆదేశాలు మేరకు పట్టణ అద్యక్షుడు అబిబ్ లాల సమక్షంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభకు నియోజకవర్గం నుండి సూమారు 50 వాహనాలతో బయలుదేరేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు. పట్టణంలో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఉదయం 10గంటల సమయం లో భయలు దేరేందుకు సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిస్టిక్ జనరల్ సెక్రెటరీ నవాజ్ షరీఫ్, సీనియర్ నాయకులు సుకుర్ , ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నవీన్ కుమార్ చంద్రశేఖర్ తౌసిబ్ ,ఆసిఫ్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు