రత్నాపూర్ లో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో బాగంగా శనివారం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ఈ పనులను పరిశీలించారు. వివిధ కూడలిలో పేర్కొని పోయిన చెత్తచెదారం తొలగించారు. గ్రామంలో నిలవ ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడం, శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పెండ్లి రమ్య, వార్డ్ మెంబెర్ కె.సది తదితరులు పాల్గొన్నారు.