ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోని సింగరేణి అధికారులు..!

జనంసాక్షి, రామగిరి : వినాయక ఉత్సవ కమిటీలను ఇబ్బందులకు గురిచేస్తున్న సింగరేణి అధికారులు. వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన సింగరేణి అధికారులు పట్టించుకోవడం లేదని బిజెపి నాయకులు ములుమూరి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ..vసెంటనరీ కాలనీ లోని వినాయక ఉత్సవ కమిటీలను ఆర్ జి త్రీ సింగరేణి అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని హిందూ పండుగలు వచ్చినప్పుడే ఇలాంటి నిబంధనలు పెడుతున్నారని కార్మికులు చేసుకునే పండుగకు కరెంట్ బిల్లు కట్టాలి..పర్మిషన్ తీసుకోవాలి..అని అంటున్నారు లేకపోతే వినాయకుని పెట్టొద్దని చెప్తున్నారని అన్నారు. 9 రోజులు నవరాత్రులు మాత్రమే ఉండే వినాయకునికి ఇన్ని నిబంధనలు ఎందుకు సింగరేణి కంపెనీలో కార్మికులు కూడా భాగస్వామి అని అధికారులు మర్చి పోతున్నారని వాపోయారు. ఉత్సవ కమిటీలను ఇబ్బందుల గురి చేస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీలతో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు యాట భూమేష్, తీగల శ్రీధర్, బండి సాయి, కట్టగోని సాగర్ పాల్గొన్నారు.