బంక మట్టి వినాయకుడినే పూజిద్దాం…..
——————————————-
గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ గుండేటి యోగేశ్వర్.

వినాయక చవితి పర్వదినం రోజున బంకమట్టి వినాయకుడినే పూజించాలని విద్యాశాఖ గ్రీన్ కోర్ జిల్లా కో. కోఆర్డినేటర్ గుండేటి యోగేశ్వర్ అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఏస్ యాదయ్య ఆదేశాల మేరకు శనివారం స్థానిక జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పర్యావరణ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బంకమట్టి నాయకుల తయారీ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం నీటి కాలుష్యం, రసాయనాల ప్రభావంతో జలచలజీవులు, నీటిమొక్కలు, పశుపక్షాదులు మృత్యు వాతన పడుతున్నాయని పేర్కొన్నారు. భావితరాలపై మరియు జీవ వైద్యంపై ఎంతో దుష్పరిమాణం కలుగుతుందన్నారు. విద్యార్థి దశ నుంచి పర్యావరణ మిత్రులు అలవాట్లు పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు సొంతంగా తయారుచేసిన బంకమట్టి వినాయకులను మరియు బంకమట్టి వినాయకుల ప్రాధాన్యం కార్డులను ప్రదర్శిస్తూ ప్రదర్శించి నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో హెచ్.ఎం .ఎం.దుర్గయ్య , గ్రీన్ టీచర్ శ్రీనివాస వర్మ ఏ వేణుగోపాల్, స్వామి,రాజమౌళి, రాజయ్య, మహేష్, రంగరాన్ని నీల్ కమల్ పర్యావరణ క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు.