చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసన రిలే నిరాహార దీక్షకు
సంఘీభావం తెలిపిన
రఘునాథ పాలెం సెప్టెంబర్ 16(జనం సాక్షి)
ఖమ్మం నగరం లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానిక ఖమ్మం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ సంఘీభావం తెలియజేశారు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందని అక్రమ కేసు బనాయించి అరెస్టు చేయడం అన్యాయమని లింగాల అన్నారు సంబంధిత అధికారులను విచారించకుండా అవినీతి జరిగిందో లేదో నిర్ధారించకుండా ఏకపక్షంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యఅని అయన అభిప్రాయపడ్డారు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసును ఉపసంహరించుకొని వెంటనే బెయిల్ మంజూరు చేసి చంద్రబాబు నాయుడు విడుదలకు చొరవ చూపాలని లింగాల డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చావా రామారావు, నల్లమల రంజిత్, చింతనిప్పు నాగేశ్వరరావు,
పొదిల భూపతి, మహిళా నేతలు చుండూరి రాజేశ్వరి, మందలపల్లి రజిని, కామ అనిత, నాయకులు ఎర్ర గంగాధర్, తప్పేట భాస్కర్, కె.బిక్షం తదితరులు పాల్గొన్నారు