తెలంగాణ సంక్షేమం దేశానికి ఒక దిక్సూచిగా: మంత్రి కొప్పుల..


ధర్మపురి( జనం సాక్షి) ధర్మపురి పట్టణంలోని ఆదివారం ఉదయం ఎస్ హెచ్ గార్డెన్ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందించిన సేవలను తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సంక్షేమంలో స్వర్ణ యుగం సాధించిన తీరు దేశానికి ఒక దిక్సూచిగా మారిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో సదరం క్యాంపులు నిర్వహించి వారి యొక్క వికలాంగత్వ శాతాన్ని గుర్తించి వివిధ రకాల ఉపకరణాలు దివ్యాంగుల కోసం అందించడం జరిగిందని, మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు ఇందులో భాగంగా శరీర వికలాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు పంపిణీ చేయడం జరిగింది కృత్రిమ అవయవాలు కాళ్లు,చేతులు డాక్టర్ల ద్వారా పరీక్ష చేయించి కొలతలు తీసుకుని ఆర్డర్లతో అమర్చడం జరిగిందని మంత్రి ఈశ్వర్ తెలిపారు.దివ్యాంగుల కొరకు వీలు చైర్లు 37 మందికి బ్యాటరీ ఆపరేట్ వీల్ చైర్ 4 మందికి. ట్రై సైకిల్లు 49 మందికి బ్యాటరీ ఆపరేటర్ సైకిల్లు 154 మందికి గాను, మోటార్ స్కూటర్లకు 59 మందికి. చేతి కర్రలు 25 మందికి ఇవ్వగా, మూగ, చెవిటి కోసం హైబ్రిడ్ ద హియర్ రింగ్ ఎయిడ్స్( 13 )మందికి ఇవ్వగా స్మార్ట్ కెనల్లకు (03) మందికి లాప్ టాప్ ఇవ్వగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరియు రిటర్నింగ్ మెటీరియల్ (05 )మందికి గాను మరియు బ్రెయిలీ కేన్లు 8 మందికి ఇవ్వడం జరిగింది ఇలా మొత్తం ఉపకరణాలకు కలిపి రూ.1,48,88,000-రూపాయలను దివ్యాంగులకు అందజేయడం జరిగింది. వికలాంగులకు వికలాంగుల కొరకు ప్రత్యేకమైన హెల్ప్ లైన్ సెంటర్ 155 326 టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగిందని దీని ద్వారా వికలాంగులకు తక్షణమే ఎలాంటి సహాయం అయినా అందించ బడుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ వేదికలో పాల్గొన్న డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్. ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి జెడ్పిటిసి బత్తిని అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సతేమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్, బుగ్గారం జడ్పిటిసి ఎంపీపీ బాదినేని రాజమణి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.