విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు
విగ్నేశ్వరా……

మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య
విట్టల్ నాయక్.
తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విట్టల్ నాయక్ నివాసంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణనాథుని ప్రతిష్టాపించి ఘనంగా పూజలు నిర్వహించారు. జగదీశ్వర్ పూజారివేదమంత్రాలు ఉచ్చరిస్తూ గణనాథుని ప్రతిష్టాపించి కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ మాట్లాడుతూ విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించాలని లంబోధరున్ని వేడుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా భక్తిశ్రద్ధలతో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ పూజారి వేదమంత్రాలతో ఆశీర్వదించి అన్ని కార్యక్రమాల్లో విజయ ప్రాప్తిరస్తు అంటూ దీవిస్తూ తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ కుటుంబ సభ్యులు వర్త్యకిష్టమ్మ ,వర్త్య ప్రశాంతి ,వర్త్య రవి కుమార్ మరియు మనుమడు వర్త్య విగ్నేశ్వర్, పూజారి జగదీశ్వర్ స్వామి తదితరులు ఉన్నారు.