నిధులు లేక మధ్యాహ్నం భోజనం కరువు బషీరాబాద్
సెప్టెంబర్ 19,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిధులు లేక మధ్యాహ్నం భోజనం కరువు అన్ని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు.ఈ సందర్భంలో విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థి విద్యార్థులకు ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 172 మంది,ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న 180 మంది విద్యార్థులకు మంగళవారం రోజున భోజనం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సంఘటన పైన ఎంఈఓ సుధాకర్ రెడ్డి వివరణ అడగగా యండీయం వాళ్లకు ఆరు నెలల నుండి నిధులు లేక యండీయం వాళ్లు వంట చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు టిఫిన్లు తెచ్చుకోమని ముందే చెప్పామని తెలిపారు. ఈ సంఘటన పైన ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పై చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.