బిఅరెస్ కార్యకర్త లకు
నివాళులర్పించిన వంగూర్ ప్రమోద్ కుమార్ రెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్19 (జనంసాక్షి)

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల,జగత్ పల్లి గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ కార్యకర్తలు రాములు, అనారోగ్యంతో, రవిసాగర్ గుండెపోటు తో మరణించారు. విషయం తెలుసుకున్న వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ కుమార్ రెడ్డి పార్థివ దేహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిస్తూ మనోధైర్యాన్ని ఇచ్చారు.ఆయన వెంట బిఅరెస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారు.