దుబ్బాక టికెట్ అధిష్టానమే నిర్ణయిస్తుంది…
ఎవరికి టికెట్ ఇచ్చిన సహకారం అందించాలి…
సిడబ్ల్యుసి ప్రత్యేక సభ్యుడు దాద్రా నగర్ పిసిసి అధ్యక్షులు మహేష్ శర్మ…
జనం సాక్షి దుబ్బాక
దుబ్బాక టికెట్ అధిష్టానమే నిర్ణయిస్తుందని అందుకు పార్టీ నాయకులు కట్టుబడి ఉండాలని సిడబ్ల్యుసి ప్రత్యేక సభ్యుడు దాద్రా నగర్ పిసిసి అధ్యక్షులు మహేష్ శర్మ అన్నారు. సోమవారం
దుబ్బాక నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటిలో ఉన్న ముగ్గురు నాయకులను ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉందో తెలుసుకోవడానికి విచ్చేసిన సిడబ్ల్యుసి ప్రత్యేక సభ్యుడు దాద్రా నగర్ పిసిసి అధ్యక్షులు మహేష్ శర్మ కు దుబ్బాక మండలం హబ్షీపూర్ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మెంబర్ కత్తి కార్తీక గౌడ్ పార్టీ కార్యాలయం వరక భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలోని కత్తి కార్తీక గౌడ్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండలంలోని సిడబ్ల్యుసి ప్రత్యేక సభ్యుడు దాద్రా నగర్ పిసిసి అధ్యక్షులు మహేష్ శర్మ తో కలిసి కత్తి కార్తీక గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా
సమావేశం ఆయన మాట్లాడుతూ….కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆరు అంశాలపై డిక్లరేషన్ చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరకు దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న ముగ్గురిలో ఎక్కువ మెజారిటీ ఉన్న వారికి టికెట్ విషయంలో మేము ఇచ్చే సర్వే పై అధిష్టానం టికెట్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తుందని అన్నారు. టికెట్ ఇచ్చిన వారికి మిగతా నాయకులు సహకరించి దుబ్బాక లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిజ్జ భూపాల్ గౌడ్, శేఖర్, శ్రీనివాస్, సాయి చరణ్ గౌడ్, బొడ్డు రాజు, డప్పు రాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.