మానవత్వానికి మారుపేరు డాక్టర్ సంపత్ కుమార్.
నిండు గర్భిణీకి రకదానం చేసి ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ సంపత్ కుమార్.
154వసారి రక్తదానం చేసి రికార్డు.
పేద ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిన వైద్యులు సంపత్ కుమార్.
తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)
ప్రసూతి కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణీకి బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలాజీ నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ రక్తదానం చేశారు.అరుదుగా లభించే ‘ఓ నెగటివ్’ బ్లడ్ గ్రూపును కలిగి ఉన్న సదరు మహిళకు రక్తం తక్కువగా ఉండటంతో అత్యవసరంగా ఆమెకు రక్తమెక్కించాల్సిన అవసరం వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు పలువురిని ఆశ్రయించగా ఫలితం లేకుండా పోయింది. చివరికి వాట్సాప్ గ్రూప్ లో ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని మెసేజ్ చూసిన సందర్భంగా గమనించిన బాలాజీ నర్సింగ్ వైద్యులు సంపత్ కుమార్ వేంటనే ఆసుపత్రికి చేరుకొని రక్తదానం చేశారు.ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. తాండూరు మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని వెంటనే రక్తం అందజేయాలని చెప్పడంతో అరుదైన బ్లడ్ గ్రూప్ ‘ఓ నెగిటివ్’ కలిగిన ఆమెకు ఇబ్బందులు తలెత్తాయి. వాట్సాప్ గ్రూప్ ద్వారా మెసేజ్ ను చూసిన పట్టణంలోని బాలాజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్ వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చెరుకొని రక్త దానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన గర్భిణీ కోసం ఓ ప్రైవేటు వైద్యుడు వచ్చి రక్తదానం చేయడం పట్ల పలువురు ఆయనను ప్రశంసల తో ముంచెత్తారు. వైద్యుని మానవత్వానికి ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆయనకు చేతులెత్తి మొక్కారు. కాగా అరుదైన ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కలిగిన డాక్టర్ సంపత్ కుమార్ ఇప్పటివరకు 154 వసారి రక్తదానం చేసి రీకార్డ్ సృష్టించారు