ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుంటాం..
మంత్రి మహేందర్ రెడ్డి.

తాండూరు సెప్టెంబర్ 19(జనంసాక్షి)ఆపదలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబాన్ని ఆదుకుం టాంమని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. యాలాల మండలం అక్కంపల్లి, పేర్కంపల్లి గ్రామాలకు చెందిన ఇరువురు బాధిత లబ్ధిదారులకు లక్ష 32 వేల సీఎం రిలీఫ్ ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రి పాలైన యాలాల మండలం అక్కంపల్లి గ్రామాల చెందిన రామకృష్ణకు లక్ష రూపాయల చెక్కును, పేర్కంపల్లి గ్రామానికి చెందిన రాములుకు కుటుంబానికి రూ.32 వేల చెక్కును అందిం చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం బాధ్యతగా భావించి ఆర్థిక సహాయం అందించేం దుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆపదలో ఉన్న ప్రతీ ఒక్కరిని ఆదుకుంటున్నా మని వివరించారు.ఈ కార్యక్రమంలో సిద్రాల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.