గద్వాల ఎమ్మెల్యేని కలిసి ఆర్.ఎం.పి, పి.ఎం.పి ల నాయకులు.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి);

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని ఆర్.ఎం.పి పి.ఎం.పి లు వారి నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.అనంతరం శాలువా బొకేతో ఘనంగా జోగులాంబ గద్వాల జిల్లా ఆర్ఎంపి, పి ఎం పి వైద్యులు సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎం.మురళి శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు రజనీకాంతరావు సూరే, పి.హుస్సేన్, ఎస్టి శంకర్, భీష్మాచారి, షాకీర్, రాజు, రవి సూరే, దర్గా రెడ్డి, వీరారెడ్డి, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.