మాజీ ఉపాధ్యక్షుడు జేఎమ్మార్ కు కృతజ్ఞతలు తెలిపిన డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు

సికింద్రాబాద్ ఆర్ సి జనం సాక్షి సెప్టెంబర్18 కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒకటో వార్డ్ బోయిన పల్లి చెందిన పలువురు లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కావడంతో సోమవారం నాడు పలు బస్తీల స్థానికులు మాజీ ఉపాధ్యక్షుడు జక్కులు మహేశ్వర్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు చెప్తారు. మా మాలాంటి పేద ప్రజలకు డబ్బులు బెడ్ రూమ్ ఇవ్వటానికి సిఫార్సు చేసినందుకు బోయిన పల్లి ఒకటో వార్డ్ బస్తీ వాసుల ఆనందంతో మహేశ్వర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్,రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,మల్కాజ్ గిరి ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు.వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రావటానికి మాజీ ఉపాధ్యక్షుడు జక్కులు మహేశ్వర్ రెడ్డి కృషి ఎంతగానో ఉందని సంతోషంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.