చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేవరకు డ్రైవర్స్ ఓనర్స్ యూనియన్ పోరాటం
యూనియన్ అధ్యక్షులు ఎండి. మాలిక్
దీక్షల్లో కారు డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ నేతలు
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : చేర్యాలను రెవెన్యూ డివిజన్ సాదించేంత వరకు లైట్ మోటార్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ పోరాటం చేస్తుందని యూనియన్ అధ్యక్షులు ఎండి. మాలిక్ పేర్కొన్నారు. సోమవారం చేర్యాల డివిజన్ సాధనకై పాత బస్టాండ్ వద్ద చేస్తున్న దీక్షలు 8వ రోజుకు చేరుకోగా ఈ దీక్షల్లో డ్రైవర్స్, ఒనర్స్ యూనియన్ నాయకులు కూర్చున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన యూనియన్ చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాదించేంత వరకూ జేఏసీ నిర్వహిస్తున్న ఉద్యమంలో ముందుంటామని తెలిపారు. చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికను ప్రభుత్వం గుర్తించి రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగం రెడ్డి, జేఏసీ యూత్ నియోజకవర్గ నాయకుడు గద్దల మహేందర్ కండువ వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో గౌరవాధ్యక్షులు ఆడెపు మహేష్, అధ్యక్షులు పచ్చిమడ్ల మహేందర్ గౌడ్, పాక బాలయ్య, రాచకొండ శ్రీనివాస్, తాళ్ల పల్లి పర్శరాములు, సాతెల్లి దేవయ్య, ఆడెపు చందు, ముస్త్యాల మహేందర్, పాక శ్రీనివాస్,సిర్ల మురళి, మైక్ యాదగిరి, అంబటి అంజయ్య గౌడ్, మాచర్ల మనోహర్, చుంచు పాపయ్య, శ్రీరామ్ రమేష్, మాచర్ల శ్రీనివాస్, కర్రె కరుణాకర్, ముస్త్యాల మహేష్, పూర్మ వాసుదేవా రెడ్డి, ఎండి. బాషమియా, తుమ్మలపల్లి గణేష్, పరంకుశం వెంకటేష్, ముస్త్యాల నరేష్, కర్క కిషోర్, చిలుకల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.