అనంతరంలో మట్టి వినాయకులు పంపిణీ చేసిన ఎంపీటీసీ...

భువనగిరి టౌన్ (జనం సాక్షి):-భువనగిరి మండలంలోనిఅనంతారం గ్రామంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సామల వెంకటేష్ సొంత డబ్బులతో మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది .ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువ వాడడం వల్ల భూగర్భ జలాలు కలుషితమయితాయి, మరియు కలర్స్ లో ఉన్న కెమికల్స్ వల్ల జీవరాశులకు హాని కలుగుతుంది కావున పర్యావరణ పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు వాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిందం మల్లికార్జున్, మాజీ ఎంపిటిసి శంకరయ్య సార్ , మల్కాజిగిరి ట్రాఫిక్ ఎస్ఐ శివ శంకర్ గౌడ్ , గ్రామ శాఖ అధ్యక్షుడు బొట్టు మల్లేశం , టిఆర్ఎస్ మండల యూత్ ఉపాధ్యక్షులు మధు, యూత్ అధ్యక్షులు మధిర వినోద్, కాల్య రాజు, పాదరాజు శ్యామ్ , పల్లెపాటి అంజయ్య మరియు ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు