గణపతి ￰హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి మంథని : పెద్దపల్లి జిల్లా మంథని రావుల చెరువు కట్ట గణపతి వద్ద మంగళవారం ఉదయం గణపతి ప్రత్యేక పూజ, గణపతి హోమం కార్యక్రమంలో మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆ విగ్నేశ్వరుని కోరుకున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు.