జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి

నియామక పత్రాన్ని అందజేసిన జాతీయ చైర్మన్ డా. మహమ్మద్ యాసీన్

చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 19 : జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ జాతీయ చైర్మన్ డా. మహమ్మద్ యాసీన్ నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. నేటి నుండి సంస్థ యొక్క రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తూ నేషనల్ కమిటీ తీర్మానం చేయగా రాష్ట్ర అధ్యక్షులు గా బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి నియామకం అయ్యారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ఈ సంస్థ లొ అతి తక్కువ సమయంలో రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం పట్ల అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సంస్థ గుర్తించి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడం సంతోషకరం అని వారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ మానవ హక్కుల కమిటీ సంస్థ ఏ పార్టీలకు, సంఘాలకు అనుబంధం కాదని నీతి అయోగ్ ద్వారా ఆమోదం పొందిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని స్పష్టం చేశారు. మానవ సేవే మాధవ సేవల పనిచేస్తానని, అతి త్వరలోనే రాష్ట్ర పలు దిక్కుల్లో ప్రజల సమస్యలపై పోరాడానికి సిద్ధం చేస్తానని, పేద ప్రజలకు అండగా ఉంటూ మానవ హక్కులకు, చట్టపరమైన నియమ నిబంధనకు లోబడి ఉంటూ, ప్రజలకు ప్రభుత్వనికి మధ్య వారధిగా ఉంటూ సంస్థ యొక్క పేరును నిలబెట్టే దిశగా కృషి చేస్తానని, దీనికి అందరూ సహకరించాలని, జిల్లా, మండల కమిటీల తో త్వరలోనే రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలొ నేషనల్ చైర్మన్ డా. మహమ్మద్ యాసీన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చారగొండ రమేష్ రెడ్డి, ప్రచార కార్యదర్శులు ఎలకంటి రాజు, యాసారపు కర్ణాకర్, ములుగు జిల్లా అధ్యక్షుడు పాలతీయ రాజ్ శేఖర్ నాయక్, బచ్చనపేట మండల అధ్యక్షులు ఇజ్జగిరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.