మార్నింగ్ వాక్ లో ప్రమాదం
గుర్తు తెలియని వాహనం ఢీ కొని దంపతుల మృతి
రెండు లక్షల తక్షణ సహాయం ప్రకటించిన ఎమ్మెల్యే కంచర్ల
నల్గొండ బ్యూరో, జనం సాక్షి. మంగళవారం ఉదయం పానగల్ రోడ్డు లో మార్నింగ్ వాక్ చేస్తున్న దంపతులను గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటన లో మరణించిన దంపతుల కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రకటించారు.ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ప్రమాద స్థలాన్ని సందర్శించి వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ మృతి చెందిన
ఓర్సు విష్ణు మూర్తి, స్వప్న దంపతుల పార్థివ దేహాలను
ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో సందర్శించి నివాళులర్పించారు.
ఎన్ జి కళాశాల లో కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేస్తున్న విష్ణుమూర్తి అతని భార్య స్వప్న. రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయమని, వారి పిల్లలు అనాధలయ్యారని వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని,కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
వారి పిల్లల పేరు మీద రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని,ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలియజేశారు.అయన వెంట
మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి.. సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య, స్థానిక కౌన్సిలర్ ఆలకుంట్ల మోహన్ బాబు, పట్టణ పార్టీ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు, సూర మహేష్ తదితరులు వెంట ఉన్నారు