అధికారంలోకి వస్తాం… ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం..!
మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గన్ శ్యాం దాస్ నగర్ సర్పంచ్ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఏఐసీసీ సెక్రెటరీ ,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తుక్కగూడలో నిర్వహించిన విజయభేరి భారి బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రకటించిన అభయ హస్తం పథకాలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం, కార్యక్రమాల ఆరు గ్యారెంటీ కార్డులనులను మంథని నియోజకవర్గం లోని పాలకుర్తి మండలం జిడి నగర్ లో ప్రజలకు శ్రీధర్ బాబు వివరించారు. కాంగ్రెస్ హస్తం సామాన్యులకు అభయహస్తం అని, అందుకు
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కాంగ్రెస్ గారంటీ కార్డు భరోసా అని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో గ్యారంటీ కార్డులో చెప్పిన ప్రకారంగా హామీలు అన్ని అమలు చేస్తమని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. మహాలక్ష్మి ప్రతి మహిళకు ప్రతినెలా రూ.2500లు, 500 కి గ్యాస్ సిలిండర్, రైతుభరోసా కింద ప్రతిఏటా రూ. 15000 లు, రూ.12000 లు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు, వరి పంటకు రూ 500 బోనస్ ఇస్తామన్నారు. గృహాజ్యోతి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి ఐదులక్షల అందించనున్నామన్నారు. యువవికాసం కింద ప్రతివిద్యార్ధికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషల్ స్కూల్ ఏర్పాటు ద్వారా ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించనున్నామన్నారు,చేయూత పింఛన్ ప్రతినెలా నాలుగువేల రూపాలు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతను కల్పించనున్నామని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం, జిల్లా యూత్ అధ్యక్షులు జెమిని గౌడ్, బామ్లా నాయక్ తండ సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ రెడపక వసంత మల్లేష్, మాజీ సర్పంచ్ బాలసాని కుమార్ గౌడ్, జిల్లా జాయింట్ సెక్రెటరీ గౌసియ, సింగిల్ విండో డైరెక్టర్ శంకరమ్మ వెంకటేష్, శేకిలాల్, బోల్లు ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షులు కోయాడ శ్రీశైలం, భుతగడ్డల రమేష్, యూత్ అధ్యక్షులు సంపంగి సంతోష్, సంపంగి కుమార్, కమిరే శంకర్,సూర మల్లయ్య ,సూర ఎల్లయ్య, కలవేన శ్రీనివాస్,నమల రాయమల్లు, మాజీ ఎంపిటిసి హనుమకొండ రాము,రాజీవ్ తాండా మాజీ ఉపసర్పంచ్ జ్యోతి శంకర్, అరుకల సతీష్, కాల్వ తిరుపతి,కట్ట భాస్కర్,బలు, బుర్లా రాములు, నేరెళ్ళ శ్రీనివాస్,ఎరుకల సాగర్, రానపుర్ యువత, కేశోరామ్ కార్మికులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.